
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘మెగా158’ (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిరు యాక్షన్ మోడ్‌లోకి ప్రవేశించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ సారథ్యంలో ఈ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఈ యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులకు వింటేజ్ చిరును గుర్తుకు తెచ్చేలా ఉంటాయని టాక్ నడుస్తోంది.
‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యువనటి అనస్వరా రాజన్‌ను చిత్ర బృందం స్వాగతించింది.ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, ‘జైలర్’ ఫేమ్ విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కొల్లా అవినాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఆంటోనీ రూబెన్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.గత ఏడాది చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘ది బ్లేడ్ దట్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

