Find Articles

ఓటీటీలోనూ ‘పెద్ది’ హవా.. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10లో రామ్ చరణ్ మూవీ

ఓటీటీలోనూ ‘పెద్ది’ హవా.. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10లో రామ్ చరణ్ మూవీ

థియేటర్లలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ గ్లోబల్ టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంది.

నెట్‌ఫ్లిక్స్ తాజా గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ మూవీస్ ర్యాంకింగ్స్‌లో ‘పెద్ది’ ఐదో స్థానంలో నిలిచింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే 1.9 మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ సినిమా, భారత్‌లోనూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో రూ.340 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ వేదికపైనా అదే జోరును కొనసాగించడం విశేషం.

ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పెద్ది’ హిందీ వెర్షన్ జూలై 30 నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది.

ManaTV Team