Find Articles

TTA Mega Conventionలో యూఎస్ పొలిటికల్ ఫోరం.. అమెరికా రాజకీయాలపై ఆది రెడ్డి సాథి ప్రత్యేక ప్రసంగం

TTA Mega Conventionలో యూఎస్ పొలిటికల్ ఫోరం.. అమెరికా రాజకీయాలపై ఆది రెడ్డి సాథి ప్రత్యేక ప్రసంగం

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక ‘యూఎస్ పొలిటికల్ ఫోరం’ నిర్వహించనున్నారు. “ది పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ – లీడర్‌షిప్, పాలసీ అండ్ కమ్యూనిటీ ఇంపాక్ట్” అనే అంశంపై జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ప్రజా విధానాల నిపుణుడు ఆది రెడ్డి సాథి ముఖ్యవక్తగా పాల్గొననున్నారు. అమెరికా రాజకీయ వ్యవస్థలో నాయకత్వం, ప్రజా సేవ, విధాన రూపకల్పన, సమాజాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, తల్లిదండ్రులు, కమ్యూనిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని టీటీఏ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం జులై 19 మధ్యాహ్నం 1 గంటకు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది.

 

ManaTV Team