Find Articles

అస్వస్థతకు గురైన అన్నా హజారే.. ముంబయి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స

అస్వస్థతకు గురైన అన్నా హజారే.. ముంబయి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఇన్‌ఫెక్షన్, డీహైడ్రేషన్ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబయిలోని బాంబే ఆసుపత్రి ఐసీయూలో చేర్పించారు.

మొదట రాలేగణ్ సిద్ధి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ముంబయికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు కిడ్నీ పనితీరుతో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వైద్యుడు గౌతమ్ భన్సాలి పర్యవేక్షణలో అన్నా హజారేకు చికిత్స కొనసాగుతోంది.

ManaTV Team