విశాఖపట్నంలో సుమారు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో AIG హాస్పిటల్ నిర్మాణం చేపడుతోంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.9 ఎకరాల క్యాంపస్‌లో 1,000 పడకలతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.
మొదటి దశలో 650 పడకలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.2028 నాటికి అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్ట్, విశాఖపట్నాన్ని మెడికల్ హబ్‌గా మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.