Find Articles

అమెరికాలో IOC బోస్టన్ చాప్టర్ ప్రారంభం.. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని అద్దంకి దయాకర్ పిలుపు

అమెరికాలో IOC బోస్టన్ చాప్టర్ ప్రారంభం.. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని అద్దంకి దయాకర్ పిలుపు

అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ బోస్టన్ చాప్టర్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ హాజరై కాంగ్రెస్ నాయకులు, తెలుగు మరియు భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశాల్లో ఉంటున్నప్పటికీ మాతృభూమిపై భారతీయులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం అభినందనీయమని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన అందిస్తోందని, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్ఆర్ఐల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, విదేశాల్లో సంపాదించిన అనుభవం, నైపుణ్యంతో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, IOC ద్వారా సమర్థవంతమైన నాయకులను తయారు చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని, రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు

ManaTV Team