Find Articles

బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్ట్‌.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు?

బ్రహ్మపుత్రపై చైనా ప్రాజెక్ట్‌.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు?

టిబెట్‌లో యార్లుంగ్ సాంగ్పోగా పిలిచే బ్రహ్మపుత్ర నది.. నమ్చా బర్వా పర్వత ప్రాంతంలోకి చేరుకున్నప్పుడు దిశ, ప్రవాహ స్వభావంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న మెడోగ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ కారణంగా నది సహజ ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నది ప్రవాహంలో మార్పులు కేవలం చైనాకే పరిమితం కాకుండా సరిహద్దులు దాటి అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, బంగ్లాదేశ్‌ ప్రాంతాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో భారత్‌ బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, సంభవించే మార్పులను ముందుగానే అంచనా వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ManaTV Team