Find Articles

Dubai–Tel Aviv విమానంలో హైజాక్ అలర్ట్.. ఫైటర్ జెట్లతో ఇజ్రాయెల్ అప్రమత్తం

Dubai–Tel Aviv విమానంలో హైజాక్ అలర్ట్.. ఫైటర్ జెట్లతో ఇజ్రాయెల్ అప్రమత్తం

దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానంలో హైజాక్ అలర్ట్ రావడంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఇజ్రాయెల్ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ ఫైటర్ జెట్లను రంగంలోకి దించినట్లు సమాచారం.

భద్రతా కారణాల నేపథ్యంలో విమానాన్ని సౌదీ అరేబియా వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. విమానంలో అసలు ఏం జరిగిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

హైజాక్ అలర్ట్‌కు కారణం ఏమిటి? విమానంలో ఏదైనా భద్రతా సమస్య తలెత్తిందా? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ManaTV Team