Find Articles

అందరికీ మేలు జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి: మోహన్ భగవత్

అందరికీ మేలు జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి: మోహన్ భగవత్

మహారాష్ట్రలోని యవత్మాల్‌లో నిర్వహించిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా అభివృద్ధిపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. అభివృద్ధి అంటే సమాజంలోని ప్రతి ఒక్కరినీ ఒకే స్థాయికి తీసుకురావడం కాదని, వివిధ వర్గాల మధ్య ఉన్న అంతరాలను, సమాజంలోని హెచ్చుతగ్గులను తగ్గించడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు.

కొంతమందికే గరిష్ఠ ప్రయోజనం చేకూరాలనే ఆలోచనను ఆయన వ్యతిరేకించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు.

ప్రతి వ్యక్తికి ప్రాథమిక అవసరాలతో పాటు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పించడమే నిజమైన అభివృద్ధికి నిదర్శనమని మోహన్ భగవత్ వివరించారు.

ManaTV Team