Find Articles

న్యూజెర్సీలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. నిమజ్జన వేడుకలకు 1,000 మందికి పైగా భక్తుల హాజరు

న్యూజెర్సీలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. నిమజ్జన వేడుకలకు 1,000 మందికి పైగా భక్తుల హాజరు

న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఉన్న సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహించిన గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి.

నిమజ్జనం రోజున సుమారు 1,000 మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేలంపాటలో ఒక భక్తుడు లడ్డూను గెలుచుకున్నారు.

ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, వాలంటీర్లు, మీడియా ప్రతినిధులకు ఎస్‌డీపీటీ ట్రస్టీ రఘు కృతజ్ఞతలు తెలిపారు.

భక్తుల భాగస్వామ్యం, ఆలయ కమిటీ సభ్యులు మరియు వాలంటీర్ల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

ManaTV Team