సెప్టెంబర్ నెలలో దేశ జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 14.7 శాతం వృద్ధితో రూ.2,03,521 కోట్లకు చేరాయి.
వరుసగా మూడో నెలలోనూ జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం విశేషం.
సెప్టెంబర్‌లో కేంద్ర జీఎస్టీ ద్వారా రూ.37,762 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ ద్వారా రూ.45,363 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ద్వారా రూ.1,20,396 కోట్లు వసూలయ్యాయి.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.12,46,278 కోట్లకు చేరుకున్నాయి.