హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కోకాపేట నియోపోలిస్‌లోని కురుమ సంఘం భవన్ సమీపంలో యువకుడి మృతదేహం లభ్యమైంది.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. యువకుడిని మరోచోట హత్య చేసి, మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్నగా గుర్తించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బ్యాట్‌తో తలపై బలంగా కొట్టి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
వెంకన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంటూ పీహెచ్‌డీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.