Find Articles

7 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానానికి పిడుగు.. సేఫ్‌గా ల్యాండింగ్

7 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానానికి పిడుగు.. సేఫ్‌గా ల్యాండింగ్

పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు భాగం కొంత మేర దెబ్బతిని, లోపలికి చొచ్చుకుపోయింది.

పిడుగు తాకిన వెంటనే అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని లఖ్‌నవూ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఈ ఘటన సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అదృష్టవశాత్తూ వారంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

విమానం ల్యాండ్ అయిన అనంతరం అధికారులు దెబ్బతిన్న భాగాన్ని పరిశీలించి, తదుపరి చర్యలు చేపట్టారు.

ManaTV Team