కొత్తపట్నం బీచ్లో గురువారం ఉదయం కలకలం చోటుచేసుకుంది. సముద్రం నుంచి ఓ బోటు తీరానికి కొట్టుకొచ్చింది. ఆ బోటులో నాలుగు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ బోటు చెన్నైకి చెందినదిగా తెలుస్తోంది. బోటులో మొత్తం 15 మంది మత్స్యకారులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
సముద్రంలో అలల ఉధృతి కారణంగా బోటు దారి తప్పి తీరానికి కొట్టుకొచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే బోటులోని మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఈ ఘటనకు గల అసలు కారణాలు ఏమిటి? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, సంబంధిత అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.