Find Articles

వర్జీనియాలో డిసెంబర్ 5న కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు.. తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం!

వర్జీనియాలో డిసెంబర్ 5న కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు.. తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం!

అమెరికాలోని వర్జీనియాలో యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆఫ్ వర్జీనియా (UTCFVA) ఆధ్వర్యంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు, తెలుగు క్రైస్తవ కుటుంబాలు, స్థానిక కమ్యూనిటీ ప్రజలను నిర్వాహకులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

డిసెంబర్ 5, 2026, శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. వర్జీనియాలోని ఆష్‌బర్న్‌లో ఉన్న అవర్ సేవియర్స్ వే లూథరన్ చర్చిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలు:

  • క్రిస్మస్ కరోల్స్
  • క్రిస్మస్ ఆటలు, వినోద కార్యక్రమాలు
  • ప్రత్యేక క్రిస్మస్ సందేశం
  • చిన్నారులకు బహుమతులు
  • శాంటా క్లాజ్‌తో ఫోటోలు
  • ప్రత్యేక విందు

ఆశ, శాంతి, ఆనందం, ప్రేమ అనే క్రిస్మస్ సందేశాన్ని చాటిచెప్పేలా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ఆనందంగా క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ManaTV Team