హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్ సహా నాలుగు దేశాల నౌకలకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన నౌకలకు ఈ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతినిచ్చినట్లు ఇరాన్ పార్లమెంటరీ అధికారి అహ్మద్ హయత్ మొగద్దమ్ ప్రకటించారు.
ఇంధన సరఫరాలు, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ దేశాలకు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిస్థాయి మినహాయింపు కాదని, ఈ మార్గంలో నౌకల రాకపోకలకు రవాణా రుసుములు విధించే అవకాశం ఉందని వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాంతీయ ఆధిపత్యం, వ్యూహాత్మక దౌత్యంలో భాగంగానే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామం భారత్తో పాటు ఇతర దేశాల ఇంధన సరఫరాలు, సముద్ర వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.