Find Articles

రామాయణ’ మూవీ అరుదైన రికార్డు.. గంటలో 1.39 లక్షల టికెట్ల అమ్మకం!

రామాయణ’ మూవీ అరుదైన రికార్డు.. గంటలో 1.39 లక్షల టికెట్ల అమ్మకం!

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక యాక్షన్ డ్రామా చిత్రం ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. సోమవారం బుక్ మై షోలో కేవలం గంట వ్యవధిలోనే 1.39 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారతదేశంలో ఇప్పటివరకు ఒక గంటలో నమోదైన అత్యధిక టికెట్ల విక్రయాల రికార్డు ఇదేనని తెలిపాయి.

ఈ జాబితాలో ‘రామాయణ’ తర్వాత ‘ధురంధర్-2’ గంటలో 1.09 లక్షల టికెట్ల విక్రయాలతో రెండో స్థానంలో ఉండగా, ‘పుష్ప-2’ 1.08 లక్షల టికెట్లతో మూడో స్థానంలో నిలిచింది.

దీపావళి మరుసటి రోజు కావడంతో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవు ఉండటం కూడా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు కారణమవుతోందని తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య ‘రామాయణ’ సాధించిన ఈ టికెట్ విక్రయాల రికార్డు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ManaTV Team