అట్లాంటా: పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా అట్లాంటాలోని హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో తొలి కార్తీక సోమవారం వేడుకలను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా నవంబర్ 9, 2026, సోమవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
సాయంత్రం 6 గంటలకు మహాన్యాసం నిర్వహించనుండగా, రాత్రి 7 గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు.
ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
కార్తీక మాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో, ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొని భగవాన్ శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు.
ఆ పరమశివుని అనుగ్రహంతో అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు.