Find Articles

అనిరుధ్ రవిచందర్ – కావ్య మారన్ వివాహ వేడుకలకు గ్రీస్‌లో ఏర్పాట్లు

అనిరుధ్ రవిచందర్ – కావ్య మారన్ వివాహ వేడుకలకు గ్రీస్‌లో ఏర్పాట్లు

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహంపై ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి వివాహ వేడుకలు గ్రీస్‌లో నవంబర్ 10, 11 తేదీల్లో జరగనున్నట్లు సమాచారం.

ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు గ్రీస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.

వివాహ వేడుకలు ముగిసిన అనంతరం నవంబర్ 21న చెన్నైలో భారీ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ స్వయంగా అతిథులను ఆహ్వానించినట్లు తెలిసింది.

అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుకలపై సినీ, క్రీడా రంగాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ManaTV Team