Find Articles

అయోధ్య రామ జన్మభూమి ఆలయంలో అర్జున్ కొత్త సినిమా లాంచ్.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్

అయోధ్య రామ జన్మభూమి ఆలయంలో అర్జున్ కొత్త సినిమా లాంచ్.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్

యాక్షన్ కింగ్ అర్జున్ మరో భారీ పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నవంబర్ 27న అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయంలో లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ రాసిన కథతో ఈ సినిమా రూపొందనుంది. దేశభక్తి, రామాయణ నేపథ్య అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సినిమా టైటిల్‌ను కూడా అయోధ్యలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

దేశవ్యాప్తంగా పలువురు అగ్రతారలు నటించనున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ManaTV Team