టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (ఏకే-47)’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. సినిమా విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వెంకటేష్‌కు ఇది 77వ చిత్రం కాగా.. ఈ సినిమాలో ఆయన సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాల్సిన తేదీ’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్‌లో ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్‌తో పాటు ‘AK 47’ అని ట్యాగ్ ఉంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటూనే, యాక్షన్ అంశాలు కూడా ఉంటాయనే ఆసక్తి పెరిగిపోతుంది. అయితే, త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఆదర్శకుటుంబం సినిమాను తెరకెక్కిస్తున్నారు.
CM Revanth Reddy Surprise Inspection of Mir Alam Tank Devt Works #short #cmrevanthreddy #MirAlamTank #manatv…
నేపాల్ లో వరదల కారణంగా హెలికాప్టర్ రెస్క్యూ #short #flood #NepalFlashFlood #breakingnews #nepal #manatv #flood #shorts #NepalFlashFlood…
#GayatriPoojaStores Beautiful Decoration Items #homedecoration #pooja #poojastar #manatvlive #GayatriPoojaStores #PoojaDecoration #DecorationItems #PoojaItems #PoojaDecorations #homedecoration #TempleDecoration…
వరదల విలయం చివరికి మిగిలింది ఇదే #short #flood #NepalFlashFlood #breakingnews #nepal #manatv #flood #shorts #NepalFlashFlood #NepalFlashFloodLive…
Gold Rate Today : 22K & 24K Prices August 27 #short #goldrate #24kgold #22kgold #goldprice…
అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట: నారా లోకేష్ #NaraLokesh #tdp #manatv #NaraLokesh #Anantapur #Anantapuram #tdp #TeluguDesamParty #TDPNews…