Categories: NRI Updates

అమెరికాలో ఘనంగా దేవీపురం శ్రీ విద్య టీచింగ్ టూర్ – న్యూజెర్సీలో శాస్త్రోక్తంగా శ్రీ జ్యోతి పూజ

విశాఖపట్నం సమీపంలోని ప్రసిద్ధ దేవీపురం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “శ్రీ విద్య టీచింగ్ టూర్ – యూఎస్ఏ టూర్ 2026” ఆధ్యాత్మిక కార్యక్రమం అమెరికాలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ విద్య తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక శిక్షణా యాత్ర కొనసాగుతోంది. అన్నపూర్ణాంబ ,  అమృతానంద నాథ సరస్వతి  ఆధ్యాత్మిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, వారి కుమార్తెలు  రాధా మార్తి మరియు  రమా కందర్ప అమెరికాలోని పలు నగరాల్లో శ్రీ విద్యకు సంబంధించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా శ్రీ విద్య ప్రాథమిక అంశాలపై ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమాలతో పాటు కలావాహన, హోమాలు, పంచాక్షరి ఉపాసన, శ్రీ జ్యోతి పూజ, మాత్రికా న్యాస వంటి అనుభవాత్మక సాధన సెషన్లు భక్తులకు అందిస్తున్నారు. ఇటీవల న్యూజెర్సీలోని సాయిబాబా టెంపుల్‌లో శ్రీ జ్యోతి పూజను శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రవాస భారతీయులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. శ్రీ విద్య సాధనపై అవగాహన పెంపొందించడంతో పాటు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను విదేశాల్లోని యువతకు చేరువ చేయడంలో దేవీపురం సంస్థ చేస్తున్న కృషిని పాల్గొన్న భక్తులు ప్రశంసించారు. అమెరికాలోని మరిన్ని నగరాల్లో కూడా ఈ శ్రీ విద్య టీచింగ్ టూర్ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

ManaTV Team

Recent Posts

‘ విశ్వంభర’ Vs ‘ జైలర్ 2 ’ .. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ.?

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు…

10 hours ago

వచ్చేస్తున్న ఘట్టమనేని వారసుడు.. ‘ శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ…

10 hours ago

‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్‌కు బన్నీ సపోర్ట్.. యూనిట్ లో కొత్త జోష్

‘బేబీ’ చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’.…

10 hours ago

జాగ్రత్త అవసరం.. ఫుడ్ సేఫ్టీపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దేశంలోని ఫుడ్ సేఫ్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన…

19 hours ago

బేబీ బంప్‌తో సమంత వర్కౌట్‌.. భర్తతో దిగిన ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ నటి సమంత జూన్ నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘జూన్ ఫెయిరీ టేల్‌లా గడిచింది’’ అంటూ సోషల్…

19 hours ago

తిరుమలలో ‘నో హారన్’ నిబంధన అమలు.. హారన్లు మోగిస్తే చర్యలు, జరిమానా అవకాశం

తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ…

2 days ago