అమెరికాలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ USA ఆధ్వర్యంలో ట్రై-స్టేట్ గాలా డిన్నర్‌ను అక్టోబర్ 3న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా దాతలు, ప్రముఖులు, కమ్యూనిటీ సభ్యులు హాజరై అక్షయ పాత్ర సేవా కార్యక్రమాలకు తమ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సేవలకు నిధుల సేకరణ కూడా చేపట్టారు.
భారతదేశంలోని పాఠశాలల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్యక్రమాలకు అక్షయ పాత్ర USA నిధులు, అవగాహన కల్పిస్తోంది. పోషకాహారంతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లల పాఠశాల హాజరు, కొనసాగింపు, విద్యాభ్యాసం మెరుగుపరచడమే సంస్థ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది.
అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 23.5 లక్షల మంది పిల్లలకు పోషకాహార భోజనం అందిస్తోంది.
ఈ గాలా డిన్నర్‌కు ప్రముఖ న్యూరోసర్జన్, CNN చీఫ్ కరస్పాండెంట్ డాక్టర్ సంజయ్ గుప్తా ముఖ్య వక్తగా హాజరై తన సందేశాన్ని అందించారు. ఆయన “Chasing Life” కార్యక్రమానికి హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
అలాగే ప్రముఖ బాలీవుడ్ గాయకుడు AB V తన సంగీత ప్రదర్శనతో గాలా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అక్షయ పాత్ర ఫౌండేషన్ CEO శ్రీధర్ వెంకట్ గాలా విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, స్పాన్సర్లు, అతిథులు, కమ్యూనిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటు వారి విద్యాభివృద్ధికి అక్షయ పాత్ర చేస్తున్న సేవలకు అమెరికాలోని కమ్యూనిటీ నుంచి లభిస్తున్న మద్దతు పట్ల ఆయన అభినందనలు వ్యక్తం చేశారు.
కాలిఫోర్నియాలోని లివర్‌మోర్‌లో ఉన్న హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ – శివ విష్ణు టెంపుల్ ఆధ్వర్యంలో వార్షిక హెల్త్…
You are cordially invited to join us in celebrating India’s Prime Minister Narendra Modi’s 25…
Two-Day Spiritual Celebration to Mark the Temple Foundation Ceremony in Texas The Flower Mound Hindu…
The APS Women’s Council invites the community to join a Cancer Awareness Walk to honor,…
Get ready for a spectacular evening of music, dance and festive celebrations at The White…
Date : Saturday, October 17th, 2026 Time : 11:00 AM - 4:00 PM EST Venue…