DMV ప్రాంతంలో ATA సందడి.. బాల్టిమోర్ మహాసభలకు ఊపందిస్తున్న వరుస కార్యక్రమాలు
అమెరికా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో మేరీల్యాండ్, వర్జీనియా ప్రాంతాల్లో జరిగిన వరుస కార్యక్రమాలు తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చాయి. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న ATA బాల్టిమోర్ మహాసభలకు ముందు నిర్వహించిన ఈ కార్యక్రమాలు సభ్యుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.
జూన్ 26న మేరీల్యాండ్‌లోని క్లార్క్స్విల్లేలో నిర్వహించిన ATA డే & ఫండ్రైజర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు సభ్యులకు వివరించారు.
జూన్ 27న హానోవర్‌లో జరిగిన ఆల్ కమిటీస్ కోఆర్డినేషన్ సమావేశంలో మహాసభల ఏర్పాట్లపై వివిధ కమిటీల ప్రతినిధులు సమీక్ష నిర్వహించారు. బాధ్యతల పంపిణీ, సమన్వయం, నిర్వహణ అంశాలపై చర్చించి కార్యాచరణను ఖరారు చేశారు. అదే రోజు కొలంబియాలో నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటాయి. జూన్ 28న వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో “భగవద్గీత – మన జీవితాలకు ప్రయోజనాలు” అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక ఉపన్యాసం ఆధ్యాత్మిక చింతనకు వేదికగా నిలిచింది. భగవద్గీత బోధనలు ఆధునిక జీవితంలో ఎలా మార్గనిర్దేశం చేస్తాయో వక్తలు వివరించారు. ఈ వరుస కార్యక్రమాలతో ATA బాల్టిమోర్ మహాసభలపై ఆసక్తి మరింత పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ప్రముఖ ఇన్వెస్టర్, రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కీలక హెచ్చరికలు చేశారు. అమెరికా ప్రభుత్వం చేస్తున్న భారీ…
The Hindu Temple of Atlanta is organizing special celebrations on the auspicious occasion of Karthika…
Gold Rate Today : 24K & 22K Prices 23-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…
The LavanyaTalkShow | Ep8 From Singer to Successful Entrepreneur | Ram Durvasula's Inspiring Journey #thelavanyatalkshow…
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం కమ్మింగ్‌లో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని…