Categories: NRI Updates

అమెరికాలో మార్మోగిన ‘ఆటా’ పేరు.. తెలుగు సమాజానికి చారిత్రాత్మక గౌరవం

అమెరికాలోని తెలుగు సమాజానికి గర్వకారణమైన అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణతో పాటు సామాజిక సేవల్లో విశేష కృషి చేస్తున్న  అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా)కు అమెరికా ప్రతినిధుల సభ (యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) అధికారిక గుర్తింపు లభించింది. తొలిసారిగా అమెరికా కాంగ్రెస్ వేదికపై ఆటా సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక ప్రసంగం జరగడం తెలుగు అమెరికన్లకు చారిత్రాత్మక గౌరవంగా నిలిచింది.

కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం సభలో మాట్లాడుతూ, జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభలు, యూత్ కాన్ఫరెన్స్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆటా కేవలం ఒక సంఘం మాత్రమే కాకుండా, అమెరికాలోని తెలుగు సమాజ ఐక్యతకు, సేవా భావానికి ప్రతీకగా నిలిచిందని ఆయన కొనియాడారు.

తెలుగు అమెరికన్లు విద్య, వైద్యం, సాంకేతిక రంగం, వ్యాపారం, పారిశ్రామిక రంగం, ప్రజాసేవ వంటి అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. అలాగే తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఆటా మూడు దశాబ్దాలుగా చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
1991లో స్థాపించబడిన ఆటా ప్రస్తుతం ఉత్తర అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘాల్లో ఒకటిగా ఎదిగింది. విద్యా కార్యక్రమాలు, యువత సాధికారత, సాంస్కృతిక వేడుకలు, ఆరోగ్య అవగాహన, స్కాలర్‌షిప్‌లు, విపత్తు సహాయ చర్యలు, మానవతా సేవల ద్వారా వేలాది తెలుగు కుటుంబాలకు అండగా నిలుస్తూ విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందింది.

అమెరికా కాంగ్రెస్‌లో తమ సంస్థకు అధికారిక గుర్తింపు లభించడం పట్ల ఆటా నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ గౌరవం వేలాది మంది స్వచ్ఛంద కార్యకర్తలు, సభ్యులు, దాతలు, కమ్యూనిటీ నాయకులకు మరింత ప్రేరణనిస్తుందని పేర్కొంది.

ఇదిలా ఉండగా, బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా మహాసభలు, యూత్ కాన్ఫరెన్స్‌కు అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల నుంచి వేలాది మంది ప్రవాస తెలుగువారు హాజరుకానున్నారు. తెలుగు సంస్కృతి వైభవం, యువత భాగస్వామ్యం, సేవా కార్యక్రమాలకు ఈ మహాసభలు మరోసారి వేదిక కానున్నాయి. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆటా నాయకులు పిలుపునిచ్చారు.

ManaTV Team

Recent Posts

ATLANTA, GET READY—RAAS & RHYTHM IS FILLING UP FAST

Don’t wait until you see the SOLD OUT announcement! Book your tickets now and join…

52 minutes ago

Saraswathi Puja – Devi Navaratri Celebrations

Saraswathi Puja – Devi Navaratri Celebrations Hindu Temple of Atlanta invites all devotees to participate…

56 minutes ago

AAA Atlanta Chapter – Growing, Innovative & Inspiring!

We are hosting FREE GENAI TRAINING for everyone. Nov 7th – Nov 29th, 2026 100%…

57 minutes ago

న్యూజెర్సీలో 17వ వార్షిక బతుకమ్మ వేడుకలు.. అక్టోబర్ 18న ఘనంగా నిర్వహణ

అమెరికాలోని న్యూజెర్సీలో న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ వార్షిక బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను…

59 minutes ago

Grand Navratri Celebration in New Jersey | Garba Nights on October 9, 10, 16 & 17

The Indian Culture Society of NJ (ICS of NJ) is organizing a grand Navratri Celebration…

1 hour ago

ప్రజల ఆశీర్వాదమే తనను ముందుకు నడిపించింది: ప్రధాని మోదీ

ప్రజల ఆశీర్వాదమే తనను ముందుకు నడిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తిని…

1 hour ago