‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆర్డర్ మార్చి తెచ్చాడనే కారణంతో ఓ డెలివరీ బాయ్ పై దాడి చేశాడని వార్తలు వచ్చాయి. కొండాపూర్ లో అఖిల్ రాజ్ ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద జరిగిన ఈ ఘటనను బాధితుడు తన ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పొరపాటును ఒప్పుకుని క్షమాపణలు కోరినప్పటికీ, అఖిల్ రాజ్ తనపై దాడి చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా హీరో తల్లి తన మొహంపై ఉమ్మేసిందని వాపోయారు. దీంతో నెటిజన్లు అఖిల్ రాజ్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా అఖిల్ రాజ్ స్పందించారు.
ఎవరికో ఇవ్వాల్సిన ఆర్డర్ ను ఆ డెలివరీ బాయ్ తప్పుగా తన ఇంట్లో ఇచ్చాడని అఖిల్ రాజ్ తెలిపారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ తిరిగొచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని చెప్పారు. మద్యం మత్తులో ఉన్నాడని, అడ్రెస్ క్రాస్ చెక్ చేసుకోలేదా అని అడిగితే దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా, తన తల్లిని కూడా దుర్భాషలాడాడని చెప్పారు. అతన్ని కొట్టలేదని, అమ్మని తిట్టాడనే కోపంలో తిరిగి తిట్టానని వివరణ ఇచ్చారు అఖిల్ రాజ్. తాను తప్పు చేస్తే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానంటూ అఖిల్ ఓ వీడియో షేర్ చేశారు.
ప్రజల ఆశీర్వాదమే తనను ముందుకు నడిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తిని…
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గుతున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్…
దేశంలో టెక్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మళ్లీ పెరుగుతున్నాయి. అక్టోబర్‌లో ఏకంగా 1.23 లక్షల టెక్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు…
ఇంద్రియాలను నియంత్రిస్తే మనశ్శాంతి | భగవద్గీత శ్లోకం 64 | Bhagavad Gita 2:64 #manatv #bhagavadgita #geetha #geethasloka…
Gold Rate Today : 24K & 22K Prices Sep 7-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 7-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…