Find Articles

‘వారణాసి’పై బిగ్ అప్‌డేట్.. అప్పటికి షూటింగ్ పూర్తవుతుంద‌న్న జక్కన్న!

‘వారణాసి’పై బిగ్ అప్‌డేట్.. అప్పటికి షూటింగ్ పూర్తవుతుంద‌న్న జక్కన్న!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వార‌ణాసి’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించి రాజమౌళి స్వయంగా ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు.

సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, వారణాసిలో జరగాల్సిన ముఖ్యమైన షెడ్యూల్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని జక్కన్న తెలిపారు. ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాలను తెలిపారు. ప్రస్తుతం కేవలం కథను ముందుకు నడిపే చిన్న చిన్న సన్నివేశాలను, ప్యాచ్ వర్క్‌ను మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేకాదు మరో నాలుగు నెలల్లో, అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తి కానుందని రాజమౌళి స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి తాజా ప్రకటనతో సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత వచ్చినట్లయింది.

ManaTV Team