రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తూ ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
కొత్త పోస్టర్‌లో యశ్ స్టైలిష్ లుక్‌లో కనిపించినప్పటికీ, ఆయన ముఖాన్ని పూర్తిగా చూపించకుండా మిస్టరీని కొనసాగించారు. సిగరెట్ వెలిగిస్తున్న యశ్ చుట్టూ పొగ, చీకటి వాతావరణం పోస్టర్‌కు ఇంటెన్స్ ఫీల్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆయన చేతిపై రక్తం కనిపించడం, వేళ్ల నుంచి రక్తపు చుక్కలు తెల్లటి షర్ట్‌పై పడుతున్న విజువల్ సినిమాలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌లకు సంకేతంగా నిలుస్తోంది.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోగా, తాజా పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది.
యశ్ అభిమానులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఆగస్టు 26న ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
ఇంద్రియాలను నియంత్రిస్తే మనశ్శాంతి | భగవద్గీత శ్లోకం 64 | Bhagavad Gita 2:64 #manatv #bhagavadgita #geetha #geethasloka…
Gold Rate Today : 24K & 22K Prices Sep 7-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 7-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…