తమిళనాడు సీఎం, నటుడు విజయ్ నుండి విడాకులు కోరుతూ సతీమణి సంగీత స్వర్ణలింగం దాఖలు చేసిన పిటిషన్‌పై చెంగల్పట్టు మహిళా కోర్టులో విచారణ జరిగింది. ఉదయం 10:30 గంటలకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది.
విజయ్ కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ సంగీత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకుల పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే ఆమె విజయ్ పై సంచలన ఆరోపణలు చేశారు. 2021లోనే విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని తాను గుర్తించినట్లు చెప్పారు. దీనిపై నిలదీసినప్పుడు ఆ బంధాన్ని తెంచుకుంటానని విజయ్ పలుమార్లు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ, విజయ్ ఆ సంబంధాన్ని కొనసాగించారని ఆరోపించారు. వారిద్దరూ బహిరంగ ప్రదేశాల్లో కలిసి ఉన్న ఫొటోలను ఆ నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తనతో పాటు తన ఇద్దరు పిల్లలు అవమానానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు విజయ్ తనపై ఆర్థిక ఆంక్షలు విధించారని, తన స్వేచ్ఛను కూడా నియంత్రించారని సంగీత ఆరోపించారు. ఈ పరిణామాల వల్ల తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని వాపోయారు. ప్రత్యేక వివాహాల చట్టంలోని సెక్షన్ 27(1)(a), 27(1)(d) కింద తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె కోర్టును కోరారు. నిజానికి ఈ కేసు విచారణ ఏప్రిల్ 20నే జరగాల్సి ఉండగా, వారిద్దరూ హాజరుకాకపోవడంతో జూన్ 15కు వాయిదా వేసిన న్యాయస్థానం, వారిద్దరూ తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఆగస్ట్ 7వ తేదీకి వాయిదా వేసింది.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…