ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తనపై జరుగుతున్న ఓ దుష్ప్రచారంపై స్పందించారు. ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఈ మేరకు ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
ఇటీవల రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఆమోదిస్తేనే తాను పొలిటికల్ జర్నీని స్టార్ట్ చేస్తానని, లేదంటే ఆ ఆలోచనను విరమించుకుంటానని స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాత ఆయన తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఇదే సమయంలో ఆయన ప్రజలను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారంటూ ఓ వీడియో క్లిప్ వైరల్ గా మారింది. తాజాగా ఈ వివాదంపై స్పందించిన రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.
‘ అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌కు సంబంధించి ఒక అపోహను నివృత్తి చేయాలనుకుంటున్నాను. నా అభిమానులు, ప్రజలు నాకు అమ్మతో సమానమని నేను ఎప్పుడూ చెబుతాను. కానీ నేను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం” అంటూ రాఘవ లారెన్స్ తన పోస్టులో పేర్కొన్నారు. మనం ఒక కొత్త ఇంటికి మారినప్పుడు, అక్కడి పరిసరాలను, ఆ ప్రాంతంలోని కుక్కల అలవాట్లను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పాను. అంతేగానీ నేను ఎంతో గౌరవించే, అమ్మలా భావించే ప్రజలను కుక్కలతో పోల్చలేదు. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుందనే విషయం గురించి మాత్రమే తాను అలా మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంలోనే తన పూర్తి వీడియోను చూసి, తాను చెప్పిన మాటలను అర్ధం చేసుకోవాలని రాఘవ లారెన్స్ కోరారు.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…