అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా నిర్వహించనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ ద్వైవార్షిక మహాసభలు, యూత్ కన్వెన్షన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేలాది మంది ప్రవాస తెలుగు ప్రజలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, యువత పాల్గొనే ఈ మహాసభలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు పూర్తి చేశారు.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల మాట్లాడుతూ, దాదాపు 70 కమిటీలు, వందలాది మంది వాలంటీర్లు రాత్రింబవళ్లు శ్రమించి మహాసభలను చిరస్మరణీయంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్య, వైద్య, అలుమ్ని, బిజినెస్ కాన్ఫరెన్సులు, యువత కోసం ప్రత్యేక సెషన్లు ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయని పేర్కొన్నారు.
ఈ మహాసభలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరుకానున్నారు.
వినోద కార్యక్రమాల్లో సినీ నటి రీతూ వర్మ, పూజా హెగ్డే, భీమి సిసిరోలో, ఆరెంజ్ స్ట్రీట్ బృందం పాల్గొననుండగా, ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి బృందం సంగీత విభావరితో ప్రేక్షకులను అలరించనుంది.
1991లో స్థాపితమైన అమెరికన్ తెలుగు అసోసియేషన్ 35 ఏళ్లుగా ప్రవాస తెలుగు ప్రజలకు సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాల ద్వారా విశేష సేవలందిస్తోంది. అమెరికాలో తెలుగు సమాజాన్ని ఏకం చేయడంతో పాటు యువత అభివృద్ధి, విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో సహకారం అందిస్తోంది. అలాగే ఆటా ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో విద్య, వైద్య సేవలు, ప్రకృతి విపత్తులు, వరదలు, కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంటోంది.
ఈసారి బాల్టిమోర్ మహాసభల్లో బిజినెస్ సెమినార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తల సమక్షంలో B2B మ్యాచ్‌మేకింగ్, ఎగ్జిక్యూటివ్ నెట్‌వర్కింగ్ సెషన్లు, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఫోరమ్‌లు, ఐడియా బజ్ వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇవి యువ పారిశ్రామికవేత్తలకు, కొత్త వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉపయోగకరంగా మారనున్నాయి.
Don’t wait until you see the SOLD OUT announcement! Book your tickets now and join…
Saraswathi Puja – Devi Navaratri Celebrations Hindu Temple of Atlanta invites all devotees to participate…
We are hosting FREE GENAI TRAINING for everyone. Nov 7th – Nov 29th, 2026 100%…
అమెరికాలోని న్యూజెర్సీలో న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ వార్షిక బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను…
The Indian Culture Society of NJ (ICS of NJ) is organizing a grand Navratri Celebration…
ప్రజల ఆశీర్వాదమే తనను ముందుకు నడిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తిని…