Categories: NRI Updates

సాయిదత్త పీఠం లో ఘనంగా దేవీ నవరాత్రి బతుకమ్మ వేడుకలు

ఎడిసన్, న్యూజెర్సీ: అమెరికాలోని ఎడిసన్‌లో సాయిదత్త పీఠం, శ్రీ శివ విష్ణు దేవాలయం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు, తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

దేవీ నవరాత్రుల సందర్భంగా జగజ్జనని దుర్గామాత సన్నిధిలో మహిళలు తమ చేతులతో అందంగా పేర్చిన రంగురంగుల బతుకమ్మలను సమర్పించి, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుచుకున్నారు. సంప్రదాయ బతుకమ్మలతో ఆలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా అత్యుత్తమంగా పేర్చిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. అలాగే సంప్రదాయ దుస్తుల్లో హాజరైన పెద్దలు, చిన్నారులకు ఉత్తమ వస్త్రధారణ విభాగంలో బహుమతులను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో సాయిదత్త పీఠం వ్యవస్థాపకులు, చైర్మన్ శ్రీ రఘు శర్మ శంకరమంచి మాట్లాడుతూ.. జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితం బతుకమ్మ పూలలా వికసించాలని కోరుకున్నారు.

అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ManaTV Team

Recent Posts

బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు

అమెరికాలోని బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) ఆధ్వర్యంలో నవంబర్ 1న దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. కాలిఫోర్నియాలోని శాన్…

3 hours ago

లండన్‌లో ఘనంగా టాక్ చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు

లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా…

6 hours ago

గ్రేటర్ బోస్టన్‌లో ఘనంగా MATA బంగారు బతుకమ్మ వేడుకలు – 2026

అమెరికాలోని గ్రేటర్ బోస్టన్‌లో మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ వేడుకలు – 2026 ఘనంగా…

7 hours ago

న్యూజెర్సీలో ఘనంగా NJTA 17వ వార్షిక సద్దుల బతుకమ్మ వేడుకలు

అమెరికాలోని న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ (NJTA) ఆధ్వర్యంలో 17వ వార్షిక సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి,…

8 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని…

5 days ago

Devi NavaRathri Celebrations – Day 7

Dear Devotees, As part of the ongoing Devi NavaRathri celebrations, we warmly invite you and…

5 days ago