అమెరికాలోని న్యూయార్క్‌లో ఆధ్యాత్మికత, సాహిత్యం, సంగీతాల సమ్మేళనంగా ‘హర హర మహాదేవ – శివ తత్వాలు’ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 14, 2026న శనివారం ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమం జరగనుంది.
న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (NYTTA), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA), తెలుగు లలిత కళా సమితి (TLCA), SPB మ్యూజిక్ అకాడమీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. SPB మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ సంగీత విభావరి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ గీత రచయిత, గాయకుడు, సినీ సంగీత దర్శకుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, 72 మేళకర్త రాగాలపై విశేష పట్టు కలిగిన శ్రీ స్వర వీణాపాణి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
‘హర హర మహాదేవ – శివ తత్వాలు’ పేరుతో శివుని ఆధ్యాత్మిక వైభవాన్ని, శివతత్వంలోని అంతరార్థాన్ని సాహిత్యం, సంగీతం ద్వారా ప్రేక్షకులకు అందించనున్నారు. SPB మ్యూజిక్ అకాడమీ కళాకారులు పాటలను ఆలపించనున్నారు.
నవంబర్ 14న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. న్యూయార్క్‌లోని హిక్స్‌విల్లేలో ఉన్న అసామాయి హిందూ టెంపుల్ అండ్ సాయి దర్బార్ ఈ వేడుకకు వేదిక కానుంది. కార్యక్రమానికి హాజరయ్యే వారికి డిన్నర్ సదుపాయం కూడా కల్పించనున్నారు.
సంగీతాభిమానులు, సాహిత్య ప్రియులు, శివభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక సంగీతానుభూతిని ఆస్వాదించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా 1984…
నాగ్‌పూర్‌లో నవంబర్ 10న నిర్వహించిన మహేశ్వరి పంచాయతీ దీపావళి వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు. ఈ…
తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరగా, కేరళ ప్రభుత్వం అందుకు నిరాకరించింది.…
అయ్యప్ప స్వామి దయవల్ల మాకు ఏమీ జరగలేదు : శేఖర్ మాస్టర్ #shekharmaster #ayyappaswamy #shekharmaster #ayyappaswamy #ayyappa #sabarimala…
Gold Rate Today : 24K & 22K Prices 12-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…
విజయసాయిరెడ్డిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు #kapaul #vijayasaireddy #ysjagan #manatv aul #vijayasaireddy #ysjagan #andhrapolitics #telugunews #politicalnews…