వెలుగుల పండుగ దీపావళి వేడుకలు లండన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటిష్, ఆఫ్రికన్, భారతీయ, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన ప్రజలతో పాటు ఉత్తర, దక్షిణ భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
సంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ దేశాల సంస్కృతులను ప్రతిబింబించే కార్యక్రమాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ ప్యారడైజ్ పాయింట్ స్పాన్సర్ చేసిన రుచికరమైన వంటకాలు వేడుకల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక విందుగా నిలిచాయి.
ది మెంటర్ రింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
ది మెంటర్ రింగ్ సీఈఓ సుజాత తలాడి, రోజీ బేడీ నేతృత్వంలో ఈ ప్రత్యేక దీపావళి వేడుకలను నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పడంతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రజల మధ్య స్నేహభావం, ఐక్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నిలిచింది.
ప్రముఖుల హాజరు.. ప్రత్యేక ఆకర్షణ
ఈ వేడుకలకు లండన్ బరో ఆఫ్ బెక్స్లీ ప్రతినిధి డిప్యూటీ లెఫ్టినెంట్ మిస్టర్ డేవిడ్ ఈస్టన్, లండన్ డిప్యూటీ మేయర్ ఫర్ కమ్యూనిటీస్ అండ్ సోషల్ జస్టిస్ డాక్టర్ డెబ్బీ వీక్స్-బెర్నార్డ్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. వారి హాజరుతో కార్యక్రమానికి మరింత ప్రత్యేకత చేకూరింది.
దేశాలు వేరైనా, భాషలు వేరైనా పండుగ సంబరాల్లో అందరూ ఒక్కటేనని ఈ వేడుకలు చాటిచెప్పాయి. భారతీయ సంప్రదాయాల గొప్పతనాన్ని, సాంస్కృతిక వైవిధ్యంలోని ఐక్యతను ప్రతిబింబించిన లండన్ దీపావళి సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా 1984…
నాగ్‌పూర్‌లో నవంబర్ 10న నిర్వహించిన మహేశ్వరి పంచాయతీ దీపావళి వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు. ఈ…
తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరగా, కేరళ ప్రభుత్వం అందుకు నిరాకరించింది.…
అయ్యప్ప స్వామి దయవల్ల మాకు ఏమీ జరగలేదు : శేఖర్ మాస్టర్ #shekharmaster #ayyappaswamy #shekharmaster #ayyappaswamy #ayyappa #sabarimala…
Gold Rate Today : 24K & 22K Prices 12-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…
విజయసాయిరెడ్డిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు #kapaul #vijayasaireddy #ysjagan #manatv aul #vijayasaireddy #ysjagan #andhrapolitics #telugunews #politicalnews…