Categories: PoliticsTelangana

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు | సీఎం రేవంత్ రెడ్డి

డిసెంబర్ నుంచి హైదరాబాద్ లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సు : యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు – ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్ ను తీర్చిదిద్దుతున్నాం – ⁠తెలంగాణకు అత్యుత్తమ బిజినెస్ స్కూల్స్ రాకతో అగ్రగామి కార్పొరేట్ సంస్థల చూపు రాష్ట్రం వైపు హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ హైదరాబాద్‌లో ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌’గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని యూకే బిజినెస్ స్కూల్స్ బృందం భేటీలో అన్నారు. ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో నిర్వహించిన భేటీలో యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమొరియా, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ సీఈఓ ఫ్లోరా హామిల్టన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రతినిధులతో సహా 30 మంది వివిధ యూకే యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వివిధ యూకే బిజినెస్ స్కూల్స్ కు సంబంధించిన డీన్లు, ఉన్నత స్థాయి అధికారులతో చర్చిస్తూ, విశ్వవిద్యాలయాలకు అవసరాలకు తగ్గట్టు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంఐటీ, పర్డ్యూ వంటి పలు ఐవీ లీగ్ యూనివర్సిటీలు హైదరాబాద్ లో ఆఫ్ షోర్ క్యాంపస్ ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్నారు. విదేశీ విద్యాసంస్థల రాకతో స్థానిక విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి, ఇక్కడే పరిశోధనలు చేపట్టడానికి దోహదపడుతుందన్నారు. యూకే బిజినెస్ స్కూల్స్ తెలంగాణలో ఏర్పాటైతే ప్రపంచ స్థాయి కార్పొరేట్ వ్యాపార సంస్థలు రాష్ట్రం వైపు చూస్తాయని అన్నారు. అదే సమయంలో రాష్ట్ర విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ అనుభవం, ప్రపంచ స్థాయి అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ దిశగా హార్వర్డ్, ఎంఐటి, లండన్ విశ్వవిద్యాలయం, వర్జీనియా టెక్, నార్త్‌ఈస్టర్న్ విశ్వవిద్యాలయం వంటి అనేక ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన వంటి రంగాల్లో భాగస్వామ్యాలు ప్రారంభించవచ్చన్నారు. అలాగే విద్యార్థులకు ఇంగ్లీష్, జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీని దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో, దేశంలోనే మొట్టమొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుతో భావితరాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డిసెంబర్ లో అక్కడ నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026కు బృందానికి ఆహ్వానం పలికారు. యూకే విద్యా వ్యవస్థలో ముఖ్యులందరికీ గ్లోబల్ సమ్మిట్ కు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్టు వివరించారు. దావోస్ లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తరహాలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఫ్యూచర్‌ సిటీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థలు ముందుకొస్తున్నాయి. టీసీఎస్ 70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటాసెంటర్ నిర్మించనుంది. లక్ష కోట్ల పెట్టుబడితో అమెజాన్ ఇప్పటికే డేటాసెంటర్ నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రపంచంలోనే మేటి విశ్వవిద్యాలయాలు, ఫార్చ్యూన్-500 కంపెనీలు తెలంగాణాలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు, అలాగే ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీల ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటి ద్వారా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యం గురించి ప్రస్తావించారు

ManaTV Team

Recent Posts

The LavanyaTalkShow | Ep8 From Singer to Successful Entrepreneur | Ram Durvasula’s Inspiring Journey

The LavanyaTalkShow | Ep8 From Singer to Successful Entrepreneur | Ram Durvasula's Inspiring Journey #thelavanyatalkshow…

2 days ago

తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితి.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 159/1

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు…

3 days ago

అమెరికాలో కార్తీక పౌర్ణమి వేడుకలు.. నవంబర్ 23న జ్వాలా తోరణం కార్యక్రమం

అమెరికాలోని జార్జియా రాష్ట్రం కమ్మింగ్‌లో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని…

3 days ago

అట్లాంటాలో డిసెంబర్ 4న భజన్ క్లబ్బింగ్.. భక్తి సంగీతంతో ఆధ్యాత్మిక సందడి

అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో భక్తి సంగీత ప్రియుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అట్లాంటా భజన్ క్లబ్బింగ్ (ABC)…

3 days ago

మలేషియాలో భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు.. 2027 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు

మలేషియా వెళ్లాలనుకునే భారతీయులకు కీలక అప్‌డేట్. భారతీయులకు ప్రస్తుతం కల్పిస్తున్న వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని డిసెంబర్ 31, 2026తో…

3 days ago

Hindu Temple of Atlanta cordially invites you and your family to the MAHA RUDRA YAGAM

MAHA RUDRA YAGAM November 20–22, 2026 Saturday, November 21 – Special Highlights 3:00–5:00 PM –…

3 days ago