Find Articles

మిచిగన్‌లో ఘనంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ “మీట్ అండ్ గ్రీట్”

మిచిగన్‌లో ఘనంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ “మీట్ అండ్ గ్రీట్”

మిచిగన్: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ(IOC USA)– మిచిగన్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో Indian Overseas Congress USA  అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియన్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో ఆత్మీయంగా సమావేశమైన అతిథులు, భారతదేశ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర, తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధి, భారతీయ సమాజ ఐక్యత, విదేశాల్లో భారతీయుల సేవల ప్రాధాన్యత వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మిచిగన్ ప్రాంతానికి చెందిన పలువురు భారతీయులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. పరస్పర పరిచయాలు, అభిప్రాయాల మార్పిడి, భవిష్యత్ కార్యాచరణపై స్నేహపూర్వక చర్చలు జరిపారు.

ఈ కార్యక్రమానికి శ్రీధర్ పటేల్ ఆతిథ్యం వహించగా,  MANA TV & TV5 USA CEO శ్రీధర్ చిల్లర ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చారు.

ప్రవాస భారతీయులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భారతీయ సంస్కృతి, సామాజిక ఐక్యత, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ManaTV Team