హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్ సహా నాలుగు దేశాల నౌకలకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. భారత్, చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన నౌకలకు ఈ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతినిచ్చినట్లు ఇరాన్ పార్లమెంటరీ అధికారి అహ్మద్ హయత్ మొగద్దమ్ ప్రకటించారు.
ఇంధన సరఫరాలు, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ దేశాలకు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిస్థాయి మినహాయింపు కాదని, ఈ మార్గంలో నౌకల రాకపోకలకు రవాణా రుసుములు విధించే అవకాశం ఉందని వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాంతీయ ఆధిపత్యం, వ్యూహాత్మక దౌత్యంలో భాగంగానే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామం భారత్తో పాటు ఇతర దేశాల ఇంధన సరఫరాలు, సముద్ర వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
అమెరికాలోని డెట్రాయిట్లో తెలుగు కుటుంబాల కోసం ‘దివాళీ ఫ్యూజన్ 2026’ పేరుతో ప్రత్యేక దీపావళి వేడుకలను నిర్వహించనున్నారు. సంగీతం, మిమిక్రీ,…
అమెరికాలోని వర్జీనియాలో యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆఫ్ వర్జీనియా (UTCFVA) ఆధ్వర్యంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు…
అమెరికాలోని అట్లాంటాలో డిసెంబర్ 6, 2026న దాసర ఆరాధనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా అట్లాంటా…
కొత్తపట్నం బీచ్లో గురువారం ఉదయం కలకలం చోటుచేసుకుంది. సముద్రం నుంచి ఓ బోటు తీరానికి కొట్టుకొచ్చింది. ఆ బోటులో నాలుగు…
Music lovers across the United States are in for a memorable musical experience as renowned…
NYC DIWALI WALI QAWALI Featuring MAJID ALI KHAN LIVE! LIMITED TICKETS AVAILABLE – BOOK NOW!…