Categories: Movie News

పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. 9 ఏళ్ల ప్రేమకు ఎండ్ కార్డ్

జబర్దస్త్ ఫేమ్ ఫైమా ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన తొమ్మిదేళ్ల ప్రేమకథకు శుభం కార్డ్ వేస్తూ, నాటకీయ పరిణామాల మధ్య ప్రియుడు ప్రవీణ్ నాయక్ ను పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఒక రిజిస్టర్ ఆఫీసులో ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది. ఈ సందర్భంగా తన పెళ్లి వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది ఫైమా.

తమ పెళ్లికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయని, తమ పెళ్లి కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఫైమా తెలిపారు. వాళ్లు మమ్మల్ని అనుమానించారు.. నిందించారు.. మమ్మల్ని విడగొట్టడానికి ప్రయత్నించారు. కానీ మా ప్రేమ ఆ అడ్డంకుల్ని అధిగమించిందని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా.. అంతులేని సహనంతో భరించాం. మేం విడిపోవడానికి వేయి కారణాలు.. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ, మేము ప్రతిరోజూ కలిసి ఉండాలనే అనుకున్నాం. మొత్తానికి భార్యాభర్తలం అయ్యాం’ అంటూ తమ ప్రేమ కథలో ట్విస్ట్‌లను రివీల్ చేశారు.

జబర్దస్త్, పటాస్ వంటి కార్యక్రమాలతో పాటు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ఫైమా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. జబర్దస్త్‌లో ప్రవీణ్, ఫైమా జోడీగా నటించారు. ఆ సమయంలో వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కాస్తా ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే, గతంలో వీరి మధ్య కొన్ని వ్యక్తిగత వివాదాలు తలెత్తాయనే వార్తలు వినిపించాయి. అయినప్పటికీ, ఆ మనస్పర్థలన్నింటినీ పక్కనపెట్టి ఫైమా, ప్రవీణ్ ఇప్పుడు ఒక్కటయ్యారు. వీరి వివాహ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ManaTV Team

Recent Posts

TTA మెగా కన్వెన్షన్ 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభం.. మరో 13 రోజుల్లో మహా వేడుక!

షార్లెట్, నార్త్ కరోలినా: ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్…

1 day ago

ఇంగ్లండ్‌తో రెండో టీ20.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.?

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి రంగం…

1 day ago

అక్కినేని అఖిల్ కోసం రంగంలోకి తారక్.?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్…

1 day ago

ఇలా మూడోసారి.. త్రిష సీరియస్

సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.…

1 day ago

నిర్మాతగా లోకేశ్ కనగరాజ్.? ఛాన్స్ కొట్టేసిన రెజీనా!

కోలీవుడ్‌లో హిట్ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’…

1 day ago

ఓటీటీలో ‘పెద్ది’ హంగామా.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'పెద్ది'. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు…

1 day ago