తమిళ స్టార్ హీరో కార్తీ దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక ‘స్ట్రెయిట్ తెలుగు సినిమా’తో టాలీవుడ్‌కి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు. కార్తీ సినీ కెరీర్‌లో 30వ మైల్‌స్టోన్ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు ‘MAD’, ‘MAD Square’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర సృష్టించిన యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’, ‘ఖైదీ’, ‘సర్దార్’ వంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌లో సాలిడ్ మార్కెట్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన నేరుగా నటించే స్ట్రెయిట్ తెలుగు సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2016లో కింగ్ నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ అనే సినిమాలో సందడి చేసిన కార్తీ… మళ్లీ ఇన్నాళ్లకు ఒక పూర్తిస్థాయి తెలుగు ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌కి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన కెరీర్ లో 30వ మైల్‌స్టోన్ చిత్రంగా తెరకెక్కుతున్న #Karthi30 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కార్తీ సరసన టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయనే టాక్ వినిపిస్తోంది. అలాగే కోలీవుడ్ టాప్ కమెడియన్ యోగి బాబు ఇంట్రెస్టింగ్ రోల్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…
కన్నడ స్టార్, జాతీయ అవార్డ్ విజేత రిషబ్ శెట్టి తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్స్ అందించారు. ‘కాంతార’…
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…