
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆమె పెద్ద కుమార్తె అవంతికతో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శ్రవణ్ శ్రీనివాసన్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గోవాలోని ఒక విలాసవంతమైన రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ వేడుకలో టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిన ఈ తారలంతా నూతన దంపతులతో ఫొటోలు దిగి సందడి చేశారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, కూడా పాల్గొన్నారు. వెండితెరపై ఒకరితో ఒకరు పోటీపడినప్పటికీ, నిజ జీవితంలో మంచి స్నేహితులుగా మెలిగే చిరు, నాగ్, వెంకీ.. తమ స్నేహితురాలి కుమార్తె వివాహంలో ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

