Find Articles

MATA సమ్మర్ క్యాంప్.. ఆగస్టు 3 నుంచి ప్రారంభం

MATA సమ్మర్ క్యాంప్.. ఆగస్టు 3 నుంచి ప్రారంభం

అమెరికాలోని తెలుగు సంఘం మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA) విద్యార్థుల కోసం ప్రత్యేక SAT సమ్మర్ క్యాంప్ నిర్వహించనుంది. అమెరికా కళాశాలల్లో ప్రవేశాలకు కీలకమైన SAT పరీక్షలో మెరుగైన స్కోరు సాధించాలనుకునే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో పరీక్షా విధానం, ప్రశ్నల పరిష్కార పద్ధతులు, సమయ నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ అందించనున్నారు.

ఈ క్యాంప్ ఆగస్టు 3 నుంచి 28, 2026 వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించబడుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 7:00 గంటల నుంచి 8:30 గంటల వరకు ఆన్‌లైన్‌లో తరగతులు జరుగుతాయి. మొత్తం 30 గంటల శిక్షణలో SAT మ్యాథ్స్, ఇంగ్లీష్ (రీడింగ్ & రైటింగ్) విభాగాల్లోని కీలక అంశాలను బోధించనున్నారు.

క్యాంప్ ఫీజు MATA సభ్యులకు 130 డాలర్లు, సభ్యులు కానివారికి 150 డాలర్లుగా నిర్ణయించారు. సాధారణంగా 500 డాలర్ల వరకు ఉండే ఈ కోర్సును రాయితీ ధరలో అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆసక్తి గల విద్యార్థులు పోస్టర్‌లో ఉన్న QR కోడ్ లేదా అందించిన నమోదు లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం  లక్ష్మీకాంత్ గజూల (732-619-7991)ను సంప్రదించాలని సూచించారు. సీట్లు పరిమితంగా ఉన్నందున, అమెరికా కళాశాల ప్రవేశాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ManaTV Team