అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండో కన్వెన్షన్ మహాసభల సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. మాటా (MATA) ఈవెంట్‌లో ప్రవాస తెలుగు కమ్యూనిటీ చూపిస్తున్న హై-లెవెల్ ఎనర్జీ, వారు సాధిస్తున్న అసాధారణ విజయాలు చూసి తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని, ఎంతో సంతోషపడ్డానని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతిని, సేవలను ముందుకు తీసుకెళ్లడంలో మాటా చేస్తున్న కృషి అనిర్వచనీయమని కొనియాడారు. ఇదే వేదికపై నిఖిల్ తన రాబోయే పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘స్వయంభూ’ గురించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న విభిన్నమైన లుక్ తనదేనని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఇదే సమయంలో తన హెయిర్‌కట్ గురించి సరదాగా వ్యాఖ్యానిస్తూ.. ఈ కొత్త లుక్ ‘హ్యాపీ డేస్’ సినిమా కోసం కాదు అంటూ వేదికపై నవ్వులు పూయించారు. రెండు రోజుల పాటు ప్రవాస భారతీయులను అలరించిన ఈ మహాసభలు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దిగ్విజయంగా ముగిశాయి.
The LavanyaTalkShow | Ep8 From Singer to Successful Entrepreneur | Ram Durvasula's Inspiring Journey #thelavanyatalkshow…
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం కమ్మింగ్‌లో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో భక్తి సంగీత ప్రియుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అట్లాంటా భజన్ క్లబ్బింగ్ (ABC)…
మలేషియా వెళ్లాలనుకునే భారతీయులకు కీలక అప్‌డేట్. భారతీయులకు ప్రస్తుతం కల్పిస్తున్న వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని డిసెంబర్ 31, 2026తో…
MAHA RUDRA YAGAM November 20–22, 2026 Saturday, November 21 – Special Highlights 3:00–5:00 PM –…