రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 11న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 2026-27 రబీ సీజన్‌కు సంబంధించి ఫాస్ఫేటిక్, పొటాషిక్ (P&K) ఎరువులపై భారీ సబ్సిడీకి ఆమోదం తెలిపింది.
ఈ సీజన్‌కు మొత్తం రూ.62,370.02 కోట్ల సబ్సిడీని కేటాయించేందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. గత రబీ సీజన్ 2025-26లో కేటాయించిన రూ.37,952.29 కోట్లతో పోలిస్తే ఈసారి అదనంగా రూ.24,417.73 కోట్లు కేటాయించారు.
ఈ కొత్త సబ్సిడీ రేట్లు 2026 అక్టోబర్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, వాటి తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులపై అదనపు భారం పడకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
డీఏపీ, ఎన్పీకేఎస్ సహా మొత్తం 28 రకాల ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులను రైతులకు సబ్సిడీ ధరలకే అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా 50 కిలోల డీఏపీ బస్తా ధరను రూ.1,350గానే కొనసాగించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం రైతులపై పడకుండా చూడటం, సాగు ఖర్చులను నియంత్రించడం, రబీ సీజన్లో ఎరువుల కొరత లేకుండా సరఫరా చేయడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా రబీ పంటలు సాగు చేసే రైతులకు ఊరట లభించనుంది.
కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా 1984…
నాగ్‌పూర్‌లో నవంబర్ 10న నిర్వహించిన మహేశ్వరి పంచాయతీ దీపావళి వేడుకల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు. ఈ…
తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరగా, కేరళ ప్రభుత్వం అందుకు నిరాకరించింది.…
అయ్యప్ప స్వామి దయవల్ల మాకు ఏమీ జరగలేదు : శేఖర్ మాస్టర్ #shekharmaster #ayyappaswamy #shekharmaster #ayyappaswamy #ayyappa #sabarimala…
Gold Rate Today : 24K & 22K Prices 12-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…
విజయసాయిరెడ్డిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు #kapaul #vijayasaireddy #ysjagan #manatv aul #vijayasaireddy #ysjagan #andhrapolitics #telugunews #politicalnews…