టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, యువ హీరో నార్నే నితిన్ ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు #NN5 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న సినిమాకు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ చిత్రంలో ‘బుట్టబొమ్మ’ ఫేమ్ అనిఖా సురేంద్రన్, కన్నడ నటి మేఘా శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ముహూర్తపు షాట్‌కు నిర్మాత వెంకట్ కె. నారాయణ క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కళ్యాణ్ శంకర్ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలకు పనిచేసిన సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనుండటం విశేషం. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ అందిస్తామని ప్రకటించింది.
Ramesh Rallapalli: My Habits, My Discipline #rameshrallapalli #manatv #rameshrallapalli #habits #discipline #successmindset #successhabits #dailyroutine #selfdiscipline…
Sri Lakshmi Devi Idols – New Collection at #srigayatripoojastore #manatvlive #srigayatripoojastore #srilakshmidevi #lakshmideviidols #lakshmidevi #deviidols…
Gold Rate Today: 22K & 24K Prices | August 22 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 22-08-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
ManaTV Network USA’s Leading Telugu Media Network | Available on YuppTV OTT | Trusted by…
IGGA Swara Vaibhavam swaraVaibhavam #igga #manatv swaraVaibhavam #igga #manatv #manatvusa #telugucommunity #teluguevents #telugumusic #teluguculturalprograms #telugunri…