టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘లెనిన్‘. పవర్‌ఫుల్ రా అండ్ రస్టిక్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా తిరుపతిలో ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అఖిల్ కు ఫ్యాన్స్ కొత్త పేరు పెట్టడం హైలైట్ గా నిలిచింది.
లెనిన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమాని అఖిల్ కు కొత్త పేరు పెట్టారు. ‘నాగ అఖిల్’ అని పిలిచారు. అదే నేమ్ కంటిన్యూ చేయాలని కోరారు. ఈ ఈవెంట్‌లో అఖిల్ స్టేజ్ పైకి రాగానే ఫ్యాన్స్ నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు అప్పటివరకు ‘అయ్యగారు’ అంటూ స్లోగన్స్ ఇచ్చిన అభిమానులు, సరికొత్తగా ‘నాగ అఖిల్’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
అక్కినేని మూల పురుషుడు లెజెండ్రీ అక్కినేని నాగేశ్వరరావు, కింగ్ నాగార్జున పేర్లలోని సెంటిమెంట్‌ను కలుపుతూ, అఖిల్‌ను ఇకపై ‘నాగ అఖిల్’ అని పిలుచుకుంటామని ఫ్యాన్స్ ప్రకటించారు. ఈ కొత్త పేరు వినగానే అఖిల్ సైతం ఎమోషనల్ అయ్యారు. అభిమానులకు చేతులెత్తి మొక్కుతూ ధన్యవాదాలు తెలిపారు. అయితే, అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య ఇలా అందరి పేర్లలో నాగ ఉంది. కానీ అఖిల్ పేరులో మాత్రం లేదు. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ నాగ అఖిల్ అని పిలిచారు. ఇప్పుడు ఈ నేమ్ సెంటిమెంట్ తో అయినా అఖిల్ సాలిడ్ హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు.
Don’t wait until you see the SOLD OUT announcement! Book your tickets now and join…
Saraswathi Puja – Devi Navaratri Celebrations Hindu Temple of Atlanta invites all devotees to participate…
We are hosting FREE GENAI TRAINING for everyone. Nov 7th – Nov 29th, 2026 100%…
అమెరికాలోని న్యూజెర్సీలో న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ వార్షిక బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను…
The Indian Culture Society of NJ (ICS of NJ) is organizing a grand Navratri Celebration…
ప్రజల ఆశీర్వాదమే తనను ముందుకు నడిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తిని…