Categories: Movie News

మరోసారి హాట్ టాపిక్ గా అనిరుధ్- కావ్య పెళ్లి వార్త.. నవంబర్ లో వేడుక.?

ప్రముఖ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌ల పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వదంతులకు బలం చేకూరుస్తూ, ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుందనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా  ‘జైలర్ 2’ సినిమా విడుదల తర్వాత వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

 తాజాగా అనిరుధ్ బంధువు, సీనియర్ నటుడు వైజీ మహేంద్ర ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకు తెలిసిన సమాచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, అంత పెద్ద ఐపీఎల్ జట్టును నడిపించగల సత్తా ఉన్న కావ్య మారన్ సాధారణమైన అమ్మాయి కాదని ప్రశంసించారు. వీరిద్దరూ చాలా మంచి జోడీ అని వ్యాఖ్యానించినప్పటికీ, పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ‘వళై పేచ్చు’ సమాచారం ప్రకారం వీరి వివాహం ‘జైలర్ 2’ విడుదల తర్వాత ఉండొచ్చని తెలుస్తుంది.   ఈ ఏడాది నవంబర్ రెండో వారంలోనే పెళ్లి జరగొచ్చని సమాచారం. అయితే ఈ తేదీలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రస్తుతం అనిరుధ్ రజనీకాంత్ ‘జైలర్ 2’, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ వంటి భారీ చిత్రాలకు సంగీతం అందిస్తూ కెరీర్‌లో దూసుకెళుతుండగా.. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవోగా క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ పెళ్లి వార్తలపై అనిరుధ్ , కావ్య కుటుంబ సభ్యులు ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

ManaTV Team

Recent Posts

అమెరికా తెలుగు సంఘం (ATA) 19వ మహాసభల్లో సాహిత్యానికి ప్రత్యేక స్థానం

American Telugu Association ఆధ్వర్యంలో అమెరికాలోని Baltimore Convention Center లో జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026…

8 hours ago

‘లెనిన్’ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు.. స్పెషల్ పోస్ట్ వైరల్!

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్', బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల…

12 hours ago

రాముడిగా మహేశ్, రావణుడిగా ఎన్టీఆర్.. ‘రామాయణం’ ఏఐ ట్రైలర్

ఏఐ టెక్నాలజీతో రూపొందించిన 'రామాయణం' ఫ్యాన్ మేడ్ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో శ్రీరాముడిగా మహేశ్…

12 hours ago

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’… డార్లింగ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ "కొరియన్ కనకరాజు". ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ బయటకు…

12 hours ago

భారత బ్యాటర్ యస్తికా భాటియా అరుదైన ఘనత..

భారత మహిళా వికెట్ కీపర్-బ్యాటర్ యస్తికా భాటియా చరిత్ర సృష్టించారు.. ప్రముఖ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో టెస్ట్ సెంచరీ సాధించిన…

21 hours ago

TTA Mega Convention: టీటీఏ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్‌కు ప్రముఖుల ఎంపిక

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో జూలై 17 నుంచి 19 వరకు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న…

2 days ago