టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ‘పెద్ది’. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే, హిందీ వెర్షన్ మాత్రం ఆగస్టులో అందుబాటులోకి రానుందని సమాచారం.
బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, శృతి హాసన్ ఓ ప్రత్యేక గీతంలో అలరించారు. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు, బోమన్ ఇరానీ, జగపతి బాబు, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Ramesh Rallapalli: My Habits, My Discipline #rameshrallapalli #manatv #rameshrallapalli #habits #discipline #successmindset #successhabits #dailyroutine #selfdiscipline…
Sri Lakshmi Devi Idols – New Collection at #srigayatripoojastore #manatvlive #srigayatripoojastore #srilakshmidevi #lakshmideviidols #lakshmidevi #deviidols…
Gold Rate Today: 22K & 24K Prices | August 22 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 22-08-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
ManaTV Network USA’s Leading Telugu Media Network | Available on YuppTV OTT | Trusted by…
IGGA Swara Vaibhavam swaraVaibhavam #igga #manatv swaraVaibhavam #igga #manatv #manatvusa #telugucommunity #teluguevents #telugumusic #teluguculturalprograms #telugunri…