Find Articles

రామ్ మిరియాలా లైవ్ కాన్సర్ట్ గ్రాండ్ సక్సెస్.. హోరెత్తిన దక్షిణ కాలిఫోర్నియా!

రామ్ మిరియాలా లైవ్ కాన్సర్ట్ గ్రాండ్ సక్సెస్.. హోరెత్తిన దక్షిణ కాలిఫోర్నియా!

పీపుల్ మీడియా ఫాక్టరీ, రాయల్ బాంక్వెట్ సమర్పణలో, సురేష్ సిస్ట్లా క్రియేటివ్ మీడియా టీం ఆధ్వర్యంలో జరిగిన రామ్ మిరియాలా లైవ్ బ్యాండ్ కాన్సర్ట్ ఒక గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఈ కార్యక్రమానికి కేవలం సాన్ డియాగో నుంచి కాదు, చుట్టుపక్కల సిటీలైన లాస్ ఏంజిలెస్, టెమెక్యులా, పెరిస్, మెనిఫీ వంటి ప్రాంతాల నుంచి, రెండు మూడుగంటల ప్రయాణం చేసి, ఈ దక్షిణ కాలిఫోర్నియా లోనే ప్రత్యేకమైన రామ్ మిరియాలా షో చూసేందుకు వచ్చి, ఈ ఆనందాన్ని ఆస్వాదించారు.  నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వైస్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మధు బోడుపాటి , అలాగే ఎగ్జిక్యూటివ్ టీం, లాస్ ఏంజిలస్ నుండి వచ్చి, ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో భాగంగా, నాట్స్ ఎగ్జిక్యూటివ్ టీం వారు సురేష్ సిస్ట్లాను నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్, సౌత్ వెస్ట్ జోన్ కి ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు.

ManaTV Team