శ్రీ వేంకటేశ్వర బాలాజీ టెంపుల్ & కల్చరల్ సెంటర్ (SVBTCC) ఆధ్వర్యంలో రెండవ ఏడాది థేమ్స్ నదిలో ఉత్సవం జరిగింది. 2025లో తెప్పోత్సవం వైదికంగా నిర్వహింపబడగా, 2026లో నామసంకీర్తనోత్సవం – “ శ్రీ హరినామ తరంగిణి ” సాంస్కృతిక పరంపరలో 14 జూన్ ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. హిందువుల హృదయాల్లో మరో చారిత్రాత్మక ఘటనగా నిలిచిన ఈ ఉత్సవం ఒక ఆధ్యాత్మిక–సాంస్కృతిక మైలురాయిగా చిరస్థాయిగా నిలిచింది. వందలాది భక్తులు పాల్గొన్న అపూర్వ, చిరస్మరణీయ సాయంకాల సమయంలో సుప్రసిద్ధ యువ కళాకారిణి, నామసంకీర్తన పరంపరలో ప్రఖ్యాత విదూషీమణి శ్రీమతి శివశ్రీ తేజస్వి సూర్య–స్కందప్రసాద్ గారు కళ, సంస్కృతి, భక్తి సమ్మిళితమైన భజనలతో భక్తబృందాన్ని ఉర్రూతలూగించగా, వేదమూర్తులు వేదపారాయణంతో భక్తి పారవశ్యాన్ని కలిగించారు. ఈ ఉత్సవానికి SVBTCC వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన శ్రీ కొచ్చెర్లకోట వీరభద్రరావు గారి ఆధ్యాత్మిక వ్యూహరచనే మూలవిరాట్.
ఆద్యంతం సునిశితమైన నిర్వహణలో SVBTCC యొక్క సాంఘిక–సాంస్కృతిక స్ఫూర్తి ప్రతిబింబించిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. శివశ్రీ ఈ ఉత్సవాన్ని ఒక దివ్యానుభూతిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని యథార్థంగా ఆవిష్కరించేందుకు తోడ్పడిన యావన్మందికి SVBTCC ముకుళిత హస్తాలతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. స్వామివారి అపార కరుణా కటాక్షవీక్షణాలతో, పరిపూర్ణ సేవాభావంతో, గాఢమైన భక్తితో ఈ అందమైన స్వప్నం సాకారమైంది అని ఉత్సవ నిర్వహక సమితి పేర్కొంది.
CM Revanth Reddy Surprise Inspection of Mir Alam Tank Devt Works #short #cmrevanthreddy #MirAlamTank #manatv…
నేపాల్ లో వరదల కారణంగా హెలికాప్టర్ రెస్క్యూ #short #flood #NepalFlashFlood #breakingnews #nepal #manatv #flood #shorts #NepalFlashFlood…
#GayatriPoojaStores Beautiful Decoration Items #homedecoration #pooja #poojastar #manatvlive #GayatriPoojaStores #PoojaDecoration #DecorationItems #PoojaItems #PoojaDecorations #homedecoration #TempleDecoration…
వరదల విలయం చివరికి మిగిలింది ఇదే #short #flood #NepalFlashFlood #breakingnews #nepal #manatv #flood #shorts #NepalFlashFlood #NepalFlashFloodLive…
Gold Rate Today : 22K & 24K Prices August 27 #short #goldrate #24kgold #22kgold #goldprice…
అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట: నారా లోకేష్ #NaraLokesh #tdp #manatv #NaraLokesh #Anantapur #Anantapuram #tdp #TeluguDesamParty #TDPNews…