సూపర్ స్టార్ మహేశ్ బాబు, దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించి రాజమౌళి స్వయంగా ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు.
సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, వారణాసిలో జరగాల్సిన ముఖ్యమైన షెడ్యూల్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని జక్కన్న తెలిపారు. ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాలను తెలిపారు. ప్రస్తుతం కేవలం కథను ముందుకు నడిపే చిన్న చిన్న సన్నివేశాలను, ప్యాచ్ వర్క్‌ను మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేకాదు మరో నాలుగు నెలల్లో, అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తి కానుందని రాజమౌళి స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి తాజా ప్రకటనతో సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత వచ్చినట్లయింది.
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ…
‘బేబీ’ చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దేశంలోని ఫుడ్ సేఫ్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన…
టాలీవుడ్ స్టార్ నటి సమంత జూన్ నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘జూన్ ఫెయిరీ టేల్‌లా గడిచింది’’ అంటూ సోషల్…
తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ…